ప్రతి యొక్కరు ఇన్సూరెన్స్ లో చేరాలి – సర్పంచ్

 గరిడేపల్లి, అక్టోబర్ 17 (జనం సాక్షి): మండలంలోని  పోనుగోడు గ్రామంలో తపాలా శాఖ వారు నూతనంగా ప్రవేశపెట్టిన  తపాలా భీమా సౌకర్యాన్ని గ్రామ సర్పంచ్ జోగు సరోజిని పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జోగు పిచ్చిరెడ్డి ఫౌండేషన్ తరపున గ్రామ పంచాయితీ సిబ్బందికి 399 రూపాయలకు 10,00000 ప్రమాద భీమా ఇన్సూరెన్స్ ను చేయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ ఈ గొప్ప ఇన్సూరెన్స్ భీమాలో  ప్రతి యొక్కరు చేరాలని కోరారు. ఈ  కార్యక్రమంలో ఫౌండేషన్ కోశాధికారి జోగు అరవింద్ రెడ్డి, తపాలా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.