ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి- శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి

శంషాబాద్ జోన్ లో నాలుగు బార్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు-శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి

రాజేంద్రనగర్. ఆర్.సి.అక్టోబర్ 10 (జనం సాక్షి) ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని శంషాబాద్ జోన్ డిసిపి నారాయణరెడ్డి అన్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందువల్ల రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం పాలమాకుల జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లను మంగళవారం డీసీపీ నారాయణ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ శంషాబాద్ జోన్ పరిధిలో చెక్ పోస్ట్ ల తనిఖీలు మరింత ముమ్మరం చేసినట్లు శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. చెక్ పోస్ట్ ల వద్ద 24 గంటలు పాటు వాహనాల తనిఖీ కొనసాగుతుందని అన్నారు. శంషాబాద్ జోన్ లో నాలుగు బార్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని,ప్రతి ఒక్క వాహనాని క్షున్నంగా పరిలించిన తర్వాతే పంపించడం జరుగుందని,వాహన దారులు పోలీసులకు సహకరించాలని అన్నారు.తనిఖీలలో డబ్బు పట్టుబడ్డట్లయితే ఐటి అధికారులకు అప్పగించడం జరుగుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామ్ కుమార్,శంషాబాద్ సిఐ శ్రీధర్ కుమార్, ఎసైలు తదితరులున్నారు.

ఫోటో రైటప్ : పాలమాకుల వద్ద ఏర్పాటుచేసిన చెక్పోస్ట్ ను పరిశీలిస్తున్న డిసిపి నారాయణరెడ్డి