ప్రతీకారరాజకీయాల్లో పరాకాష్ట
` రాహుల్ అనర్హతపై విపక్షాల భగ్గు
` పిరికపంద చర్యగా అభివర్ణించిన నేతలు
` బీజేపీ కుట్ర రాజకీయాలపై మండిపాటు
` ప్రజాస్వామ్యం కోసం మా కుటుంబం రక్తాన్ని ధారవోసింది: ప్రియాంక గాంధీ వాద్రా
న్యూఢల్లీి(జనంసాక్షి):రాహుల్‌పై అనర్హ వేటు వేయడంపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. ఈ క్రమంలో రాహుల్‌కు వివిధ పార్టీల నేతలు మద్దతు పలికారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అత్యవసరంగా సమావేశమయ్యింది. కోర్టులో తేల్చుకోవాలని కూడా కాంగ్రెస్ నిర్ణయించింది. మోదీ ఇంటిపేరు కలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటంపై కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నాయకులు మండిపడు తున్నారు. సత్యం మాట్లాడేవారి గొంతు నొక్కేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అయినా తాము సత్యమే మాట్లాడతామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అవసరమైతే జైలుకు వెళ్తామని ఖర్గే చెప్పారు. అదానీపై ప్రశ్నించినందుకే రాహుల్‌పై వేటేశారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. దేశంలో కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతు న్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి ఆరోపించారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ పాపులారిటీ పెరగడం వల్లే ఆయనపై వేటేశారని చెప్పారు. పార్లమెంట్ నుంచి తొలగించగలరు కానీ కోట్లాది మంది ప్రజల హృదయాలనుంచి రాహుల్‌ను తొలగించలేరని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెప్పారు. రాహుల్‌పై వేటు రాజకీయ ప్రేరితమని, తొందరపాటు చర్య అని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఫ్వీు అభిప్రాయపడ్డారు. రాహుల్ గొంతు నొక్కడానికి ప్రభుత్వం కొత్తదార్లు వెతుకుతోందని ఆయన ఆరోపించారు.ప్రతిపక్ష నేతలను బీజేపీ టార్గెట్ చేసిందని తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీఆరోపించారు. ప్రసంగాలను బట్టి కూడా అనర్హత వేటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని దిగజార్చారని మమత మండిపడ్డారు. దొంగ అన్నందుకు రాహుల్ సభ్యత్వం తొలగిస్తారా అని శివసేన ఉద్ధవ్ వర్గం అధినేత ఉద్ధవ్ థాకరే కన్నెర్ర చేశారు. దేశంలో దొంగలు, దోపిడిదారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వారిని శిక్షించకుండా రాహుల్‌ను శిక్షిస్తారా అని ఉద్ధవ్ ప్రశ్నించారు. దీన్ని ప్రజాస్వామ్య హత్యగా ఆయన అభివర్ణించారు. నియంతృత్వానికి ఇది ఆరంభ శూచిక అని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపిఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తన తనయుడు రాహుల్ గాంధీ ఢల్లీి నివాసానికి చేరుకున్నారు. రాహుల్‌పై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. నిజాలు మాట్లాడినందుకు రాహుల్ గాంధీకి శిక్ష పడిరదని.. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన పైకోర్టులో అప్పీలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కోర్టు గుజరాతీ భాషలో ఇచ్చిన 170 పేజీల తీర్పును ఆంగ్లంలోకి అనువాదం చేయాల్సి ఉందని.. దీనిపై అప్పీలుకు వెళ్లే పనిలో ఉన్నామని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి దేశ న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని.. ఈ తీర్పుపై చట్టప్రకారమే ముందుకెళ్లి, ఊరట పొందుతామని చెప్పారు. రాహుల్‌ను దోషిగా పేర్కొన్న ఈ తీర్పును.. దుర్బలమైన, తప్పులతో కూడిన, చట్టపరంగా నిలవని తీర్పుగా ఆయన అభివర్ణించారు. రాహుల్‌గాంధీ విషయంలో ఈ ప్రభుత్వం ఎలాంటి అనైతికమైన చర్యలకైనా పాల్పడుతుందని దుయ్యబట్టారు. కాగా.. సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం ప్రతిపక్షాలన్నింటితో సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఉదయం 10 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నట్టు సమాచారం. అనంతరం 11.30 గంటలకు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ దాకా మార్చ్ చేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడిరచింది. జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించడానికి సమయం కోరినట్టు తెలిపింది. రాహుల్ తాను చేసే ప్రకటనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు గతంలోనే సూచించింది. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు లేదు. ఆయన సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు. ఒక ఎంపీగా.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు) తీవ్రమైన విషయం. ఎంపీల ప్రకటనలకు విస్తృత ప్రభావం ఉంటుంది. ఈ కోణంలో చూస్తే ఆయన చేసిన నేరం మరింత తీవ్రమైనది. దీనికి తక్కువ శిక్ష విధిస్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. అంతేకాదు, పరువునష్టం దావా ప్రయోజనాలు నెరవేరనట్టేనని సూరత్ కోర్ట్ అభిప్రాయపడిరది.
ప్రజాస్వామ్యం కోసం మా కుటుంబం రక్తాన్ని ధారపోసింది!:ప్రియాంక
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ తీసుకున్న నిర్ణయంపై ఆయన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా మండిపడ్డారు.ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం తమ కుటుంబం రక్తాన్ని ధారబోసిందని, అలాంటి ప్రజాస్వామ్యాన్ని నేడు మోదీ (ఓనీటతి) సర్కారు అణచివేయాలని చూస్తోందని దుయ్యబట్టారు. మోదీ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.’’మోదీజీ . అమరవీరుడైన ఓ ప్రధాని కుమారుడిని దేశద్రోహి అంటూ విూ వాళ్లు విమర్శించారు. విూ ముఖ్యమంత్రి ఒకరు రాహుల్ గాంధీ తండ్రి ఎవరు? అని ప్రశ్నించారు. కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని పాటిస్తూ ఓ కొడుడు తన తండ్రి మరణం తర్వాత తలపాగా ధరిస్తే దాన్నీ రాజకీయం చేశారు. నెహ్రూ పేరును ఎందుకు పెట్టుకోలేదని విూరు (మోదీని ఉద్దేశిస్తూ) ఆ రోజు పార్లమెంట్‌లో ప్రశ్నించారు. అది మా కుటుంబాన్నీ, కశ్మీరీ పండిట్లను కించపర్చడం కాదా? కానీ దీనికి ఏ కోర్టు విూకు రెండేళ్ల జైలు శిక్ష వేయలేదు. అనర్హత వేటు పడలేదు. రాహుల్ లాంటి నిజమైన దేశభక్తుడు ఈ కుంభకోణాల గురించి ప్రశ్నించారు. విూ స్నేహితుడు అదానీ.. పార్లమెంట్ కంటే గొప్పవాడా? మా కుటుంబాన్ని విూరు పరివార్‌వాదీ అంటూ చులకన చేసి మాట్లాడారు. కానీ, ఇది తెలుసుకోండి..! మా కుటుంబం ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం తమ రక్తాన్ని ధారపోసింది. ఆ ప్రజాస్వామ్యాన్ని విూరు ఇప్పుడు నాశనం చేయాలని చూస్తున్నారు. మా కుటుంబం ప్రజల కోసం గళమెత్తింది. తరతరాలుగా నిజం కోసం పోరాడుతోంది. అదే రక్తం మా నరనరాల్లో ప్రవహిస్తోంది. దానికో ప్రత్యేకత ఉంది. విూ లాంటి అధికార దాహం ఉన్నవారు.. నియంతల ముందు మేం ఎన్నడూ తలవంచలేదు.. తలవంచబోం కూడా. విూకు కావాల్సింది చేసుకోండి’’ అంటూ ప్రియాంక తీవ్రంగా మండిపడ్డారు.
రాహుల్‌ను ఎదుర్కోలేకనే వేటు
రాహుల్‌పై వేటును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిరచింది. ఇది ప్రభుత్వం పిరికితనానానికి నిదర్శనమని పేర్కొంది. ఆదానీపై జెపిసి కోరుతూ పోరాడుతున్న క్రమంలో అనర్హత వేటు వేయడం ద్వారా బిజెపి, సంఫ్‌ు పరివార్ లో భయం ప్రస్ఫుటమయ్యిందన్నారు. లోక్‌సభలో రాహుల్‌ను ఎదుర్కోలేకనే ఇలా అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సూరత్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై చట్ట ప్రకారం ముందుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మ్లలికార్జున ఖర్గే చెప్పారు. బీజేపీ ఇలా చేస్తుందని తాము ముందే ఊహించామన్నారు. రాహుల్ నోరు నొక్కడానికే ఇలా చేశారని విమర్శించారు.అటు తన సోదరుడు భయపడే రకం కాదని, భయపడబోడని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ చెప్పారు. నిజం చెప్పడమే అలవాటని, నిజమే చెబుతామన్నారు. రాహుల్ నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. లోక్‌సభ సెక్రటేరియేట్ ఇచ్చిన నోటిఫికేషన్‌పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదో తప్పుడు నిర్ణయమని మనీశ్ తివారి అన్నారు. ఒక ఎంపీని అనర్హుడిగా ప్రకటించే అధికారం లోక్‌సభ సెక్రటేరియేట్‌కు లేదన్నారు. రాష్ట్రపతి దీనిపై నిర్ణయం తీసుకోవాలని, అది కూడా ఎన్నికల సంఘంతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. కోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటల లోపే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం దారుణమన్నారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్ , రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా బీజేపీ రాహుల్ గొంతు నొక్కే యత్నం చేస్తోందని విమర్శించారు. మరోవైపు పరువు నష్టం కేసులో తనకు రెండేళ్ల జైలు శిక్ష పడటంపై రాహుల్ స్పందించారు. సత్యమే తనకు గురువని చెప్పారు. తన ధర్మం సత్యం, అహింసలపై ఆధారపడిరదన్నారు. మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ కోర్టు తీర్పును స్వాగతించారు. ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల బెయిల్ ఇచ్చింది.