*ప్రతీ కార్యకర్త ఇంటికి పెద్ద దిక్కు కేసీఆర్*

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

మునగాల, సెప్టెంబర్ 21(జనంసాక్షి): కార్యకర్తలకు అన్నివిధాల టిఆర్ఎస్ పార్టీ  అండగా ఉంటుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం మునగాల  మండలం గణపవరం  గ్రామంలోని పార్టీలో కార్యకర్తగా ఉంటూ ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన అరవపల్లి లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ రెండు లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతీ కార్యకర్త ఇంటికి కేసీఆర్ పెద్ద దిక్కులా ఉంటారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పార్టీకి కార్యకర్తలే పునాది అన్న ఎమ్మెల్యే కార్యకర్తల కొసం టిఆర్ఎస్ పార్టీ 18 కోట్ల రూపాయలను ఇన్సూరెన్స్ గా చెల్లిస్తుందన్నారు. కార్యకర్తలకు  బీమా సౌకర్యం కల్పించడం ద్వారా వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కులా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తుండన్నారు. గ్రామా స్థాయి నుంచి పార్టీని పటిష్టపర్చడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైందన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా పార్టీ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని కోరారు. కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన ప్రమాద బీమా పథకంలో సభ్యత్వం తీసుకోవాలని ఆయన అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, సొసైటీ చైర్మన్ కందికొండ సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ విజయమ్మ నరసింహారావు, మునగాల సర్పంచ్ చింతకాయలు ఉపేందర్, సొసైటీ డైరెక్టర్ గౌని శ్రీనివాస్, గ్రామ శఖ అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు ప్రదీప్, సత్యనారాయణరెడ్డి, జితేందర్ రెడ్డి, మల్లారెడ్డి, సోమేశ్వర్ రావు, రాంబాబుగౌడ్, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.