ప్రత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ చర్యలపై రైతు శిక్షణ కార్యక్రమము మరియు క్షేత్ర ప్రదర్శనలు

పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం మమునూరు వ్యవసాయ శాస్త్రవేత్తల బృందo సంగెం మండలంలోని గవిచేర్ల గ్రామంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో రైతు శిక్షణ కార్యక్రమాన్ని మరియు క్షేత్ర ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డా. రాజు వ్యవసాయ శాస్త్రవేత్త మొదటగా గ్రామంలోని ప్రత్తి పంటలను గులాబీ రంగు పురుగు ఉనికి గమించాడానికి క్షేత్ర స్థాయి ప్రదర్శనలు నిర్వహించారు తర్వాత ప్రత్తి పంటల ఉపయోగించు వివిధ చీడ పీడల సమగ్ర సస్యరక్షణ చర్యలు వాటిని నివారించడానికి ఉపయోగించే వివిధ యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. ముఖ్యంగా ప్రత్తి పంటలో పూత దశ నుండి గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఆశించి పంట దిగుబడిని తగ్గిస్తుందని దీని ఉనికిని గుర్తించడానికి ఎకరానికి 8 లింగాకార్షక ఎరలు అమర్చుకావాలని, గ్రుడ్డి పూలను ఎరి వేయాలని మొదటి దశలో వేపనూనె లీటరు నీటికి 5 మిల్లీ లీటర్ మరియు ప్రోఫినోఫోస్ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేయవలెను అని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త గణేష్, రైతులకు మరియు నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు గాలి బిక్షపతి మరియు వెల్దండ సురేష్ పాల్గొన్నారు.

తాజావార్తలు