“ప్రత్తి పంటలో సాగులో తీసుకోవలసిన చర్యలపై రైతులకు అవగాహన”

పెన్ పహాడ్ జూలై   (జనం సాక్షి) : మండల పరిధిలోని  సింగారెడ్డిపాలేం గ్రామంలో  రైతులు సాగు చేస్తున్న ప్రత్తి పంటను గురువారం కేవికే శాస్త్రవేత్తలు ఏ కిరణ్,
డి ఆదర్శ్ పత్తి క్షేత్రాలను పరిశీలించి పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  ప్రత్తి పంట త్వరగా కోలుకోవటానికి నీటిలో కరిగే ఎరువులు అయిన (19:19:19) లేదా మల్టీ-కే (13:00:45) లేదా యూరియా 10 గ్రా. లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పంటలపై పిచికారి చేసుకోవాలని, భూమిలో తగిన తేమ ఉన్న సమయంలో గుంటుక,గొర్రుతో అంతర కృషి చేసి కలుపునివారించుకోవాలని, విత్తిన 25 నుంచి 30 రోజులలో వచ్చే గడ్డి జాతి మరియు వెడల్పకు కలుపు మొక్కలను నివారించడానికి పైరిథాయోబాక్ సోడియం 1.25 మి.లీ. (+) క్విజలోపాప్ ఇథైల్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయడం ద్వారా నివారించవచ్చని తెలిపారు వర్షాలు తగ్గిన తర్వాత  ప్రత్తి పంట ఎండిపోవడం (పార విల్ట్) గమనించి దీని నివారణకై 15 గ్రాముల యూరియా, 15 గ్రాముల మ్యురేట్ ఆఫ్ పొటాష్ మరియు 3 గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్  మిశ్రమాన్ని ఒక లీటరు నీటికి కలిపి ప్రత్తి చెట్టు మొదలు తడిసేటట్లు పోయాలను సూచించారు రసం పీల్చే పురుగులు అయిన పెనుబంక, పచదోమ వంటివి గమనించినట్లయితే వాటి నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి. లీ. లీటరు లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రా. లీటరు నీటికి లేదా అసిఫేటే 1.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని కే. వి. కే కీటక శాస్త్రవేత్త డి ఆదర్శ్ సూచించారు.ఈ కార్యక్రమంలో రైతులు పచ్చిపాల సైదులు, పచ్చిపాల గంగయ్య, పేర్ల సైదులు, గుండాల లింగయ్య,గుండాల పెద్ద ఎలమంచయ్యా పాల్గొన్నారు..
Attachments area