ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఐజి
నెల్లూరు, జూలై 28 : తడమండలం భీముని వారి పాలెం చెక్‌పోస్టువద్ద రెండు రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులను కీరాతంగా హత్యచేసిన అగాంతుకుడిని పట్టుకునే ప్రక్రియలో భాగంగా గుంటూరు రేంజ్ ఐజి హరీష్ కుమార్ గుప్త శనివారం పోలీసు అధికారులతో స్థానిక ఉమేష్‌చంద్ర మందిరంలో సమావేశం నిర్వహించారు. అత్యంత గోప్యంగా నిర్వహించిన ఈ సమావేశంలో సైకో సంచరిస్తున్న ప్రాంతాలపై చూచాయగా ఐజి పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో సైకో సంచరిస్తూ ఉండవచ్చని, కుంబింగ్ ఆపరేషన్ నిర్వహించాలని సూచించినట్లు తెలుసున్నది. అలాగే బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, నగర సివారు ప్రాంతాల్లో ఇంటలిజెన్స్ నిఘాను ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలియవచ్చింది. అనంతరం ఎస్పీతో కలసి హరీష్ కుమార్ గుప్త తడకు బయలుదేరి వెళ్ళారు.