ప్రత్యేక హోదా భారత్ సర్కార్ ఇచ్చిన హామీ
– బండ్లపల్లిలో ఉపాధి హామీ కూలీలతో రాహుల్ సమావేశం
అనంతపురం,ఫిబ్రవరి 2(జనంసాక్షి): ఎపి విభజన , తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోనే అయిదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక ¬దా ఇచ్చేందుకు తాము అంగీకరించామని, ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ¬దా ఇచ్చేందుకు సిద్ధంగా లేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. దీనిని ఎందుకు విస్మరించారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఆనాడు ప్రత్యేక¬దాతో రక్షణ కల్పించాలని చూశామని అన్నారు. అనంతపురం బండ్లపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మన్మోహన్ మాట్లాడారు. ఉపాధిహావిూ పథకం ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేశారు. ఇందులో మన్మోహన్‌తో పాటు రాహుల్ గాంధీ, పిసిసి చీఫ్రఘువీరా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టాన్రికి ప్రత్యేక ¬దా కల్పిస్తామని ఆనాడు తాము చెప్పామని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బిజెపి మాత్రం ప్రత్యేక ¬దా హావిూని నెరవేర్చడం లేదని మన్మోహన్ అన్నారు. విభజన సందర్భంగా నవ్యాంధ్రకు ఐదేళ్లు ప్రత్యేక ¬దా ఇస్తామని రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ హావిూ ఇచ్చిన విషయాన్ని మన్మోహన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు సమయంలోనే ప్రత్యేక ¬దా పైన హావిూ ఇచ్చామన్నారు. యూపీఏ హయాంలో సోనియా గాంధీ చొరవ వల్లే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. పేదరిక నిర్మూలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కృషి చేస్తోందన్నారు. యూపీఏ అధికారంలోకి వచ్చాక ఆహార భద్రత, ఉపాధి హావిూ వంటి ఎన్నో పథకాలను అమలు చేశామన్నారు. వంద రోజులు పని కల్పించేలా 2006లో ఉపాధి హావిూ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. తాను ప్రధాని ¬దాలో ప్రత్యేక ¬దా పైన హావిూ ఇచ్చానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధిహావిూ పథకానికి పదేళ్లు పూర్తికావడం సంతోషంగా ఉందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అన్నారు. అంతకుముందు రాహుల్ గాంధీ ఉపాధి కూలీలతో సహపంక్తి భోజనం చేశారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు తొలి నుంచీ కాంగ్రెస్ పార్టీ అనే విధాలుగా కృషి చేసిందని మన్మోహన్‌సింగ్ అన్నారు. సంవత్సరానికి 100 రోజులు పని కల్పించేలా 2006లో ఉపాధి హావిూ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. యూపీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియాగాంధీ చొరవతో ఉపాధిహావిూ, ఆహార భద్రత పథకాలను ప్రవేశపెట్టినట్లు మన్మోహన్ తెలిపారు. కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ¬దా ఇస్తామని ప్రకటించిందని ,అది యుపిఎ హావిూ కాదని, భారతదేశ హావిూగా పరిగణించాలని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు ఎన్.డి.ఎ.ప్రభుత్వం కాక,భారత ప్రభుత్వంగా ప్రత్యేక ¬దా ఇవ్వాలని కోరుతున్నానని ఆయన అన్నారు.ఈ అరవైఏళ్ల ఏడేళ్ల చరిత్రలో కేంద్ర ప్రభుత్వం హావిూ ఇచ్చిన తర్వాత అమలు కాకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. ఏదైనా హావిూని నెరవేర్చాల్సిన బాద్యత ప్రధాని మోడీ పై ఉందని, దానిని గుర్తు చేస్తున్నానని రాహుల్ అన్నారు. జాతీయ గ్రావిూణ పధకాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ ,సోనియాగాందీ లు బండపల్లి నుంచే ప్రారంబించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.పేదల కులం,మతం, వర్గం వంటి విషయాలతో నిమిత్తం లేకుండా పేదరికాన్ని కొలమానంగా తీసుకుని ఈ పథకాన్ని ఆరంభించామని రాహుల్ చెప్పారు.
బండ్లపల్లిలో రాహుల్ గాంధీ
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హావిూ పథకం ప్రవేశ పెట్టి పదేళ్లు పూర్తౌెన సందర్భంగా కూలీలతో కలిసి భోజనం చేశారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఏపీలోని అనంతపురం జిల్లా బండ్లపల్లికి వచ్చిన ఆయన? స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. వారి నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరిగ్గా పదేళ్ల క్రితం బండ్లపల్లి నుంచే అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉపాధి హావిూ పథకాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా హజరయ్యారు. అంతుకు ముందు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు మంగళవారం అనంతపురం జిల్లా పుట్టపర్తికి విచ్చేశారు. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న వారు అక్కడి నుంచి నేరుగా వెళ్లి సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. జాతీయ ఉపాధి హావిూ పథకం పదేళ్లు పూర్తికానున్న సందర్భంగా ఈ పర్యటన చేపట్టారు. ఉపాధి హావిూ పధకం నిధులను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వం తమ ప్రచారానికి వాడుకుంటున్నాయని ఎపి పిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు.ఈ పథకాన్ని బిజెపి,టిడిపిలు నీరు కార్చే యత్నం చేస్తున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఈ పధకం విజయవంతంగా అమలు జరిగిందని ఆయన చెప్పారు. దీనివల్ల కూలీలు వలస పోవలసిన అవసరం తప్పిందని,వారి జీవితాలకు భరోసా ఇవ్వడానికి ఆస్కారం కలిగిందని రఘువీరా చెప్పారు. అనంతపురం జిల్లా బండ్లపల్లి లో గ్రావిూణ ఉపాధి హావిూ పదకానికి సోనియాగాంధీ శ్రీకారం చుట్టి పదేళ్లు అయిందని ఆయన చెప్పారు.ఆ పథకానికి భరోసా ఇవ్వడానికిగాను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎఐసిసి ఉపాద్యక్షుడు రాహుల్ గాందీ వచ్చారని రఘువీరా తెలిపారు. రాహుల్ ,మన్మోహన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు.