ప్రధాని దేశానికే భారంగా మారారు
హైదరాబాద్: ప్రధాని మన్మోహన్‌సింగ్ పైభాజపా నేత వెంకయ్యనాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్‌సింగ్ దేశానికే భారంగా మారారని దుయ్యబట్టారు. ముస్లిం యువకుల కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్న కేంద్ర హోంమంత్రి షిండే వ్యాఖ్యలు ప్రజల్లో అపార్ధాలకు దారితీస్తాయన్నారు. షిండే వ్యాఖ్యలు దేశాన్ని మతపరంగా విభజించే కుట్రగా ఆయన అభివర్ణించారు.