ప్రధాని భద్రతా వైఫల్యంపై విచారణ కమిటీ
` ఇందుమహల్హోత్రా నేతృత్వంలో ఏర్పాటు
న్యూఢల్లీి,జనవరి 12(జనంసాక్షి):ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా వైఫ్యలంపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఒక మిటీని ఏర్పాటు చేసింది.. ఆ కమిటీకి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వం వహిస్తారని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కమిటీలో చండీగఢ్ డీజీపీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐజీ, పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు రిజిస్టార్ర్ జనరల్ మరియు పంజాబ్ ఏడీజీపీ (సెక్యూరిటీ) ఉంటారని సూచించింది.. ఈలోగా, తాము ఏర్పాటు చేసిన కమిటీల విచారణతో ముందుకు వెళ్లవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని, పంజాబ్ సర్కార్‌ను సుప్రీంకోర్టు కోరింది.. కాగా, ఈ నెల ప్రారంభంలో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ పర్యటనకు వెళ్తుండగా.. కొంతమంది నిరసనకారులు రోడ్డును దిగ్భందించడంతో ప్రధాని నరేంద్ర మోడీ 15`20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పైన చిక్కుకుపోయారు.. ఆ తర్వాత ఆయన తిరిగి ఢల్లీికి చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిని ప్రధాని మోడీ భద్రతలో పెద్ద లోపంగా పేర్కొన్న విషయం తెలిసిందే.