ప్రపంచలోనే తొలి సోలార్‌ రోడ్డు

solar-road-in-franceప్యారిస్‌: ప్రపంచంలోనే తొలిసారిగా సోలార్‌ ప్యానెల్‌రోడ్డు ఫ్రాన్స్‌లో రెడీ అయ్యింది. టైర్‌వ్రే-పేర్ఛేలోని చిన్న గ్రామం నార్మండేలో ఒక కి.మీ పొడువతో ఈ రోడ్డును అక్కడి ప్రభుత్వం సిద్దం చేసింది. ఇందుకోసం 2,880 సోలార్‌ ప్యానెళ్లను ఉపయోగించారు. ఇవి సూర్యశక్తిని విద్యుత్‌ మార్చేస్తాయి.. గ్రామంలోని వీధి దీపాలన్నింటికీ సరిపడా విద్యుత్‌ను ఇవి ఇస్తాయని భావిస్తున్నారు. వీటితో ఏడదిలో 280 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని అంటున్నారు. సాధారణంగా రోజుకు 767 కిలోవాట్లు, వేసవిలో అయితే 1500 కిలోవాట్లు దాకా విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నారు.