ప్రపంచ దేశా మధ్య కొరవడిన సహకారం
కరోనా పోరులో ఓటమికి ఇదే కారణమంటున్న గుటెరస్
జెనీవా,జూన్24(జనంసాక్షి ): కోవిడ్19 నివారణలో ప్రపంచ దేశా మధ్య సహకారం కొరవడినట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తెలిపారు. ఒంటరిగా పోరాటం చేయాన్న
విధానంతో వైరస్‌ను ఓడిరచలేమన్నారు. ఓ విూడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వ్లెడిరచారు. ఒంటరి పోరాటం వ్ల వైరస్‌ను నియంత్రించలేమన్న విషయాన్ని ఆయా దేశాు అర్థం చేసుకోవాని, వైరస్ నియంత్రణలో ప్రపంచ దేశా సహకారం అవసరమన్నారు. చైనాలో మొదలైన కోవిడ్ ఆ తర్వాత యూరోప్, అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, భారత్‌లోనూ విజృంభించిందన్నారు.
ఇప్పుడు రెండవ దశ మొదుకానున్నట్లు కొందరు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో సహకారం లోపించినట్లు ఆయన చెప్పారు. అన్ని దేశాను ఒక వేదికపైకి తీసుకురావాని, ఆయా దేశాు తమ సామర్థ్యాను ముందు పెట్టాని.. చికిత్స, టెస్టింగ్ పక్రియ, వ్యాక్సిన్ అందుబాటు గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాన్నారు. అలా అయితేనే మహమ్మారి కరోనాను ఎదుర్కొనగమన్నారు.