ప్రపంచ బ్యాంక్‌పై భగ్గుమన్న పాక్

ప్రపంచ బ్యాంకుపై పాక్ రగిలిపోnawaz-sharifతోంది. ఇస్లామాబాద్‌లో వల్డ్ బ్యాంక్ అధికారి విన్సెంట్ పాల్గొన్న పుస్తక విడుదల కార్యక్రమంలో జరిగిన ఘటనతో పాక్ షాకైంది. కార్యక్రమంలో పాకిస్థాన్ మ్యాప్‌ను చూపించేటప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను, గిల్గిత్‌-బాల్టిస్థాన్ ప్రాంతాలను మినహాయించి చూపించారు. వల్డ్ బ్యాంక్ చేసిన ఈ పనితో పాక్ ఊగిపోయింది. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే పాక్ అభ్యంతరాన్ని ప్రపంచబ్యాంకు సీరియస్‌గా తీసుకోలేదు. పైగా తమ చర్యను సమర్ధించుకుంది. కశ్మీర్‌కు సంబంధించి ప్రపంచ బ్యాంక్ వద్ద అధికారిక మ్యాప్ లేదని తాపీగా చెప్పింది. వల్డ్ బ్యాంక్ వైఖరితో పుండుమీద కారం చల్లినట్లైన నవాజ్ సర్కారు నేరుగా అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించింది. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయానికి తమ నిరసన తెలపాలని నవాజ్ సర్కారు నిర్ణయించుకుంది.