ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం.

– క్షణకావేశం లో ఆత్మహత్యలకు పాల్పడొద్దు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది

-టి పి ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు,కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కే మురళీధర్ రావు.

సంగెం: అక్టోబర్ 13 (జనం సాక్షి)
తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో
ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం సంగెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేయడమైనది. ముఖ్యఅతిథిగా తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ (టిపిఏ) రాష్ట్ర ఉపాధ్యక్షులు,కౌన్సిలింగ్ సైకాలజిస్ట్,కే మురళీధర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడుతూ మానసిక సమస్యల నివారణకు కౌన్సిలింగ్ ఒక ఆయుధం. ఆందోళన, టెన్షన్, ఒత్తిడి, నిద్రలేమి, దిగులు, మనోవేదన, లేనిపోని భయాలు, అతిశుభ్రత లాంటి చదస్తాలు, మద్యపానం, డ్రగ్స్ కు బానిసలు కావడం, ఆత్మహత్య ప్రయత్నాలు, పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని, పోటీ పరీక్షల్లో ర్యాంకు రాలేదని, నిరుద్యోగులు, ప్రేమలో విఫలం, కుటుంబ కలహాలు, మనస్పర్దాలతో దంపతులు సర్దుకోలేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, దిగులు, అవమానాలు, అనుమానాలను, ఆత్మవిశ్వాసం, జీవితం పట్ల అవగాహన లేకపోవడం, ఇలాంటి అనేక చిన్న సమస్యలకే కుంగిపోయి ఇలా చిన్న, చిన్న సమస్యలతో వందేళ్ల జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఇలా క్షణకావేశంలో ఆత్మహత్యలు పాల్పడి తమ కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిలిస్తున్నారు. ఒక క్షణం ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సమాజంలో మానసిక అనారోగ్యంపై మూఢనమ్మలకాలపై,7801078784, 9949069596,9544975350 తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ద్వారా ఉచిత ఆన్‌లైన్, ఫోన్ కౌన్సెలింగ్, ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలోతెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ (టిపిఏ) వరంగల్ జిల్లా కార్యదర్శి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ బి. సురేష్, టిపిఏ సభ్యురాలు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ పి.స్నేహలత,ప్రిన్సిపాల్ శ్రీకాంత్ రెడ్డి, అధ్యాపక బృందం, సిబ్బంది: బుచ్చిరెడ్డి, అనిల్‌కుమార్, నాగరాజు, యాకసాయిలు, కుమారస్వామి, రాఖీ, మాధవి, అక్రమ్ అలీ, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు