ప్రభుత్వం క్రీడలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తుంది
చదువుతో పాటు క్రీడల్లోను రాణించేలా పిల్లలను పోత్సహించాలి
జిల్లా కలెక్టర్ డాః బి. గోపి
కరీంనగర్ జిల్లా (జనం సాక్షి):
రాష్ట్రంలో క్రీడలకు మంచి సౌకర్యాలు ఉన్నాయని, పిల్లలకు చిన్నతనం నుండే వారి తల్లితండ్రులు చదువుతో పాటు క్రీడల్లో చురుకుగా పాల్గోనేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాః బి. గోపి అన్నారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని డాః బి. ఆర్. అంబేడ్కర్ స్టేడియంలో భారత హాకీ దిగ్గజం మేజర్ ద్యాన్ చంద్ జయంతి పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఛలో మైదాన్ పేరిట నిర్వహించిన క్రీడా అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా కార్యక్రమంలో మొదటగా భారత హకీ క్రిడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్ నివాలులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ డాః బి. గోపి మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతం ప్రపంచస్థాయిలో హాకీ క్రిడలో మంచిస్థానంలో ఉందని, ఒక్క తెలుగు ప్రాంతాల నుండి ప్రపంచస్థాయి క్రిడల్లో పాల్గోని పథకాలు సాధించిన సానియా మిర్జా, పి.వి. సిందు, నిఖత్ జరీన్, సైనా నెహ్వాల్, జావీలిన్ ప్రపంచ ఛాంపియన్ నీరజ్ చోప్రా వంటి ఎంతోమంది క్రిడాకారులు ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు మెరుగైన వసతులతో పాటు సౌకర్యాలు కల్పిస్తుందని దీంతో క్రీడాకారులు గొప్పగా రాణిస్తున్నారన్నారు. కరీంనగర్ జిల్లాలో అత్యుత్తమ క్రిడాకారులను తీర్చిదిద్దడానికి మానేరు డ్యాం వద్ద ప్రాంతీయ క్రిడా పాఠశాలతో పాటు అంబేడ్కర్ స్టేడియం లు అందుబాటులో ఉన్నాయని, వీటితో పాటు అనేక సదుపాయాలను కూడా కల్పించడం జరిగిందని పేర్కోన్నారు. తల్లితండ్రులు వారి పిల్లలను కష్టపడి చదువుకో మనడంతో పాటు చిన్నతనం నుండే క్రీడల వైపు కూడా ప్రోత్సహించి నైపుణ్యత కలిగిన క్రీడా కారులుగా తీర్చిదిద్దాలని సూచించారు. కష్టపడి చేసే కృషి సులువుగా విజయాన్ని సోంతం చేస్తుందని, భవిష్యత్తులో క్రిడల్లో ఉన్నత స్థానాలను అదిరోంచడానికి కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. మేయర్ వై. సునీల్ రావు మాట్లాడుతూ, క్రీడలకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుందని అన్నారు. జిల్లాలో క్రీడాకారులకు సదవకాశాలను కల్పించడం జరుగుతుందని, పిల్లలు కేవలం చదువుపై మాత్రమే కాకుండా క్రిడల్లో కూడా ప్రతిభను కనబరచాలని తెలిపారు. క్రీడల్లో జిల్లాకు కోదవ లేదని, ప్రతి ఒక్క క్రీడాకారునికి ప్రభుత్వం అండగా ఉంటు వారిని గోప్పక్రిడాకారులుగా తీర్చిదిద్దడంలో ఎల్లవేళాల కృషిచేయడం జరుగుతుందని అన్నారు. సిపి సుబ్బారాయుడు మాట్లాడుతూ, ప్రతిఒక్కరు ఎదైన ఒక క్రిడల్లో ఖచ్చితంగా పాల్గోనాలని, సమాజంలో ఎదురయ్యే ఒడిదుడుకులను సమర్దవంతంగా ఎదుర్కొవడంలో క్రిడలు ఎంతో తోడ్పడతాయని అన్నారు. 1928 లో అంస్టర్డ్యామ్, 1932 లో లాస్ ఏంజెల్స్ మరియు 1936 లో బెర్లిన్ జరిగిన ఒలంపిక్ క్రిడల్లో పాల్గోని భారతదేశానికి స్వర్ణాలను ధ్యాన్ చంద్ తీసుకువచ్చారని, స్వయం కృషితో కష్టపడిన ద్యాన్ చంద్ ఇటు క్రిడల్లో పాల్గోంటునే భారత సైన్యంలో సేవలను అందించి హాకీ క్రిడ కు గుర్తింపును తీసుకువచ్చారన్నారు. ద్యాన్ చంద్ స్పూర్తిగా క్రిడల్లో ప్రతిభను కనబర్చాల్సిన అవసరం ఎంతైన ఉందని తెలిపారు. ఈ సందర్బంగా జిల్లాలోని వెటరన్ క్రిడాకారులు సైక్లిస్ట్ లు మార్కెటెంగ్ అధికారి పద్మావతి, డాక్టర్ ఉషా ఖండాల, డాక్టర్ అజయ్ ఖండాల, స్విమ్మర్, సైక్లిస్ట్ చల్మడ వెంకటేశ్వర రావు, ఎస్. ఆర్ శేఖర్, లను వెటరన్ మారథాన్ క్రిడాకారులు పూసాల మహేష్, యోగా కోచ్ కిష్టయ్య, జిమ్మాస్టిక్ కోచ్ గణేష్, స్మిమ్మింగ్ కోచ్ కె. చంద్రశేఖర్ లను షాలువా, మెమెంతో లతొ సత్కరించి 100 మీటర్ల అథ్లెటిక్, 50 మీటర్ల స్మిమ్మింగ్, బ్యాడ్ మింటన్ లలో గెలుపొందిన గెలుపొందిన బాల బాలికలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణా రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, అడిషనల్ డిసిపి లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డివైఎస్ఓ రాజవీరు , ,కార్పొరేటర్ కోలా తిరుపతి, యువ కేంద్రం కోఆర్డినేటర్ రాంబాబు జిల్లా ఒలింపిక్ సంఘం జనార్దన్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.