ప్రభుత్వం చేస్తోంది అభివద్ధా? విధ్వంసమా?

ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయింది

నిరుద్యోగం కూడా పెరిగిపోయింది

కేంద్రంపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ,నవంబర్‌18(జ‌నంసాక్షి): నరేంద్ర మోదీ నేతత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మళ్లీ విమర్శలకు దిగారు. కొన్ని రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న ఆయన… మళ్లీ కేంద్రంపై విరుచుకుపడటం ప్రారంభించారు. నిరుద్యోగిత, ధరలు పెరగడంపై కేంద్రాన్ని తప్పుపడుతూ రాహుల్‌ విరుచుకుపడ్డారు. ప్రజల మనోధైర్యం రానూ రానూ తగ్గిపోతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ”ప్రజల మనోధైర్యం రానూ రానూ తగ్గిపోతోంది. ప్రభుత్వం చేస్తోంది అభివద్ధా? విధ్వంసమా? బ్యాంకులు ఇబ్బందుల్లో ఉన్నాయి. జీడీపీ కూడా అంతే. ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయింది. నిరుద్యోగం కూడా పెరిగిపోయింది. సామాజిక న్యాయం రానూ రానూ తగ్గిపోతోంది. ఈ పరిణామాలతో జరిగేది అభివద్ధో? విధ్వంసమో అర్థం కావడం లేదు.’ అంటూ రాహుల్‌ గాంధీ కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు.