ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనంసాక్షి, రామగిరి అక్టోబర్ 7 : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రాన్ని( పల్లె దావాకన) శనివారం మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రజలకి మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ముస్త్యాల గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య మాట్లాడుతూ ఒకప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి కూడా గోదావరిఖని వెళ్లే గ్రామ ప్రజలకు ఇప్పుడు గ్రామంలో వైద్య సేవలు అందుబాటులోకి రావడం జరిగిందన్నారు. ఈ ఆరోగ్య ఉపకేంద్రం కాన్సల్ కావాలని వేరే దగ్గరికి షిఫ్ట్ కావాలని ఎన్నో ఆటంకాలు అడ్డంకులు ఎన్నో సమస్యలు సృష్టించిన పట్టు వదలకుండా తమ గ్రామంలోనే నిర్మించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ సి డాక్టర్లు డా :సంపంత్, డా :ప్రదీప్ కుమార్, ఎంపిటీసి జనగామ
హేమలత బుచ్చిబాబు, ఉపసర్పంచ్ వేణుగోపాల్ రావు, వార్డ్ మెంబెర్స్ నర్సయ్య, రక్షిత్, లక్ష్మి, సిహెచ్ఓ భరత్ హెచ్ ఈ ఓ సీతారామయ్య, ఎం.ఎల్.ఎచ్.పి లత, ఏఎన్ఎం స్వరూప , విఓ సౌజన్య, కార్యదర్శి పరుశురాం, ఫీల్డ్ అసిస్టెంట్ సంపత్, ఏఎన్ఎం, ఆశలు నీల, లక్ష్మి రాజేశ్వరి, గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.