ప్రభుత్వ ఆసుపత్రిని కూల్చి వేసే నిర్ణయాన్ని మానుకోవాలి
ఆసుపత్రిని సందర్శించిన సీపీఐ (ఎం) బృందం
చేర్యాల (జనంసాక్షి) జూన్ 29 : చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని కూల్చివేసే నిర్ణయాన్ని విరమించుకోవాలని సిపిఐ(ఎం) మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ బృందం ఆసుపత్రిని సందర్శించారు. ఈసందర్భంగా వెంకట మావో మాట్లాడుతూ.. చేర్యాల ప్రాంత ప్రజలకు ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి చేర్యాల పట్టణం నడిబొడ్డున అందుబాటులో ఉన్నదని భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోలేదని కొంత చిన్న రిపేరు చేయించితే మరో 20 సంవత్సరాల కాలం ఉపయోగపడే అవకాశం ఉందని, హాస్పిటల్ పరిసరాల్లో సీసీ వేయించి, పూర్తిస్థాయిలో డాక్టర్లను, సిబ్బందిని నియమించాలని, నూతన సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేయాలని, డిజిటల్ ఎక్స్ రే,ఈసీజీ మిషన్, వీటి ఆపరేటర్ ను, స్కానింగ్ మిషన్ ఆపరేటర్ ను పిల్లల డాక్టర్లను, శాశ్వత మత్తు డాక్టర్ ను వెంటనే ఏర్పాటు చేసి చేర్యాల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. భవనాలను కూల్చి వేసే పద్ధతిని మానుకోకపోతే రాబోయే రోజుల్లో చేర్యాల ప్రాంత ప్రజలను, అఖిలపక్ష పార్టీలను ఏకం చేసి హాస్పిటల్ సేవలను మెరుగుపరచడం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్ళబండి నాగరాజు, మండల నాయకులు బండకింది అరుణ్ కుమార్, మేడిపల్లి చందు,ఎండి హజగర్, రాళ్లబండి చందు, ఈప్పకాయల శోభ తదితరులు పాల్గొన్నారు.
Attachments area