ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఆసుపత్రి అనుమతులు రద్దు
హుజూర్ నగర్ సెప్టెంబర్ 8 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని దివ్య నర్సింగ్ హోమ్ ను ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ అధికారి తనిఖీలు చేపట్టగా ప్రైవేట్ హాస్పిటల్ లో నిర్వహణ చట్టానికి సంబంధించిన నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిందని తెలిపారు. ఈ ఆసుపత్రి నందు డాక్టర్లు గాని, నర్సింగ్ సిబ్బంది గాని లేనట్లు రుజువు కావడంతో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహణ చట్టం ప్రకారం నర్సింగ్ హోమ్ యాజమాన్యం వారు 20 నిబంధనలను అతిక్రమించి నందున గురువారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, నర్సింగ్ హోమ్ అనుమతులను రద్దు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చట్ట విరుద్ధంగా నడుపుతున్న ఆసుపత్రుల అనుమతులను ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు. రద్దు చేసిన అనుమతి ఉత్తర్వులను మాస్ మీడియా అధికారి అనంత అంజయ్య గౌడ్, దివ్యా నర్సింగ్ హోమ్ యాజమాన్యానికి అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి గజగంటి ప్రభాకర్ పాల్గొన్నారు