ప్రభుత్వ పథకాల యూనిట్ల గ్రౌండింగ్‌లోబ్యాంకు అధికారులు కృషి చేయాలి

నెల్లూరు, జూలై 31 : ప్రభుత్వ పథకాలకు సంబంధించి యూనిట్ల గ్రౌండింగ్‌లో ఎప్పటికప్పుడు సమీక్షించుకొని నిర్దేశించిన లక్ష్యాలను 100 శాతం సాధించేలా బ్యాంకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గోల్డెన్‌ జూబ్లీహాలులో జరిగిన బ్యాంకర్ల జిల్లాస్థాయి సమితి సమావేశంలో ఎస్‌హెచ్‌జి బ్యాంకు లింకేజి, ఎస్‌జిఎస్‌వై, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ యాక్షన్‌ప్లాన్‌, రాజీవ్‌ యువశక్తి పథకం, పట్టణ ఇందిర క్రాంతి పథకాలకు సంబంధించి యూనిట్ల గ్రౌండింగ్‌పై బ్యాంకు అధికార్లతో కలెక్టర్‌ కుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనివ్వడం జరుగుతున్నదని, వీరికి వివిధ పథకాల క్రింద మంజూరైన యూనిట్ల గ్రౌండింగ్‌కు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి, సబ్‌ప్లాన్‌ ఖచ్చితంగా అమలయ్యేలా అధికారులు, బ్యాంకు అధికారులు తీసుకోవాలన్నారు. ఎస్‌హెచ్‌జి బ్యాంకు లింకేజిపై సమీక్షిస్తూ 2011-12 ఆర్థిక సంవత్సరంలో 12,141 గ్రూపులకు 269 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజి అందించి 94 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని, 2012-13 సంవత్సరంలో 12,870 గ్రూపులకు 284.65 కోట్లు లక్ష్యంగా నిర్దేశించగా 100 శాతం లక్ష్యసాధనకు బ్యాంకర్లు తమవంతు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌బిఐ ఎజిఎం హరిహరన్‌, ఎస్‌బిఐ ఎజిఎం కెవి ప్రసాద్‌, ఆంధ్రా బ్యాంకు ఎజిఎం శోభనాద్రి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు