ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలి
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం పేట లో ధర్నా
వరంగల్ ఈస్ట్, జూన్ 30(జనం సాక్షి):
ఖిలా వరంగల్ మండలం రంగశాయిపేట ప్రాంతంలోని శంభునిపేట ప్రభుత్వ పాఠశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది .ఈ ధర్నాలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించాలని అదేవిధంగా విద్యార్థులకు యూనిఫాం అందించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా నిధులు అన్ని పాఠశాలలకు ఇవ్వాలి మన ఊరు మన బడి పథకం ద్వారా సబ్జెక్టు టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే విద్యార్థులు నష్టపోతారు కాబట్టి వెంటనే వారిని నియమించాలని అన్నారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని త్రాగునీటి సరఫరా సౌకర్యం కల్పించాలని అన్నారు అదే విధంగా విద్యార్థులకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ విద్యను అందించి వారికి కంప్యూటర్ పరిజ్ఞానం కల్పించాలని అన్నారు పేద విద్యార్థులు చాలామంది ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ విద్యకు దూరమవుతున్నారని కాబట్టి విద్యార్థుల సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని లేదంటే రాబోయే రోజుల్లో విద్యారంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు . విద్యార్థులు చదువుకునే క్లాసు రూంలో ఫ్యాన్లు లైట్లు సరిగా లేవు అన్నారు వంట గదులు కూడా కొన్ని పాఠశాలల్లో లేవని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సీతారాం నాయక్ బలి చక్రవర్తి నితిన్ విద్యార్థులు పాల్గొన్నారు