ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య – సర్పంచ్‌ కదుర్క రాధ

 

 

మల్లాపూర్‌,జూన్‌, 05(జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని సర్పంచ్‌ కదుర్క రాధ అన్నారు. మంగళవారం మండలంలోని గొర్రెపల్లి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు దుస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన బాద్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి గ్రామస్తులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎల్లయ్య, ఉపాధ్యాయులు నారాయణ, సంతోష్‌, రాజేశ్‌, సుమలత, భవాని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.