ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎమ్మారై స్కాన్ వెంటనే ఏర్పాటు చేయాలి.*
సీజనల్ వ్యాధుల బారిన పడ్డవారికి సరైన మందులు,
ఆసుపత్రి లో *కనీస సౌకర్యాలు కల్పించాలి.
*సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి*
గొల్లపల్లి జయరాజు*
ఆసుపత్రి సూపర్డెంట్ అనిల్ కుమార్ కు వినతి
టౌన్ జనం సాక్షి
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎమ్మారై స్కాన్ వెంటనే ఏర్పాటు చేయాలి.
సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో పరియటించి ప్రజలు, రోగులు పడుతున్న బాధలను అడిగి తెలుసుకుని వచ్చిన సమస్యలతో వినతి పత్రాన్ని జిల్లా సూపరిండెంట్ గారికి వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కాలేజ్ అయినప్పటికీ ఎంఆర్ఐ స్కాన్ లేకపోవడం దురదృష్టకరమన్నారు .ఇప్పటికీ ఆసుపత్రికి అవసరమైన సిబ్బందిని కేటాయించకపోవడం తో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.సీజనల్ వ్యాధుల బారిన పడ్డవారికి సరైన మందులు, సిబ్బందిని కేటాయించాలని కోరారు. సిబిపి టెస్టు చేయడానికి అవసరమైన ట్యూబ్స్ లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. టెస్టులు చేసే సందర్భంగా మూత్ర శాలలు అవసరమైనన్ని లేకపోవడంతో మహిళలు, పురుషులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నదని అన్నారు. మాతా శిశు రక్షణ కేంద్రంలో లిఫ్టు లేకపోవడం తో గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే తక్షణమే సమస్యలన్నిటిని పరిష్కరించాలని కోరుతూ సమస్యలతో కూడిన పత్రాన్ని మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఆయన స్పందిస్తూ తక్షణమే మా పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం నరసింహులు ,డి యాదవ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.