-->

ప్రభుత్వ రంగ సంస్థల్లో , విద్యా సంస్థల్లో నిజమైన ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి..

-జాతీయ ఓబీసీ కమీషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్..
జాతీయ ఓబీసీ కమీషన్ చైర్మన్ శ్రీ హన్సరాజ్ గంగారామ్ అహిర్ సోమవారం రామగుండం పర్యటనకు వెళ్తున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి స్వాగతం పలికిన అనంతరం హన్సరాజ్ గంగారామ్ పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడటం జరిగింది. పలువరు బీసీ సంఘాల నాయకులు బీసీల సమస్యల పై వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రభుత్వం రంగ సంస్థలైన సింగరేణి, ఎన్టీపీసీ మరియు ఆర్ఎఫ్సిఎల్ లో ఓబీసీ లకు కల్పిస్తున్న రిజర్వేషన్ల పై ఈరోజు సమీక్ష నిర్వహించడం జరుగుతుందని అని హన్సరాజ్ గారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 40 ఉపకులాలను అందులో హిందూ కులాలు 26 మరియు 14 ముస్లిం కులాలను ఓబీసీ లో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని వాటి పై రేపు ఢిల్లీలో ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించి త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు.