ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించండి
నిజామాబాద్, అక్టోబర్ 16 (ఎపిఇఎంఎస్): గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిపించి మాతశిశు మరణాల రేటును తగ్గించాలని జిల్లా కలెక్టర్ క్రిస్టినా ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని పిట్ల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి వైద్యులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గర్భిణీలకు ఉచిత రవాణా సదుపాయం, ఉచిత వైద్యసేవలు, మందుల పంపిణీ, ఆర్థిక సహాయం గురించి వైద్య సిబ్బంది గ్రామస్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఆసుపత్రుల్లోనే ప్రసవాల వల్ల జరిగే మేలును వివరించాలని, తల్లిబిడ్డలకు పౌష్ఠికాహారం అందించాలని సూచించారు.