ప్రమాణస్వీకారం చేసిన నూతన ఎమ్మెల్సీలు
హైదరాబాద్,జూన్4(జనంసాక్షి): శాసనసభ్యుల కోటా నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్సీలుగా డిప్యుటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నేతి విద్యాసాగర్, బి.వెంకటేశ్వర్లు, కె.యాదవరెడ్డి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, చందూలాల్ తదితరులు హాజరయ్యారు. తరవాత కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గెలుపొందిన ఆకుల లలిత ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో డి.శ్రీనివాస్, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఐదుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అనంతరం శాసనసభాపక్ష కార్యాలయంలో కడియం శ్రీహరి విూడియాతో మాట్లాడుతూ… తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఇతరపార్టీల నేతలు తెరాసలో చేరుతున్నారన్నారు.