ప్రమాదవశాస్తు బావిలో పడ్డ బైక్‌: ఒకరు మృతి

వరంగల్‌, జనంసాక్షి: జాఫర్‌ఘడ్‌ మండలం వెంకటాపూర్‌లో ఈ రోజు బైక్‌ అదుపు తప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.