ప్రమాదవశాస్తు రైలు కిందపడి యువకుడికి తీవ్రగాయాలు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: స్థానిక రైల్వేస్టేషన్‌లో తెల్లవారుజామున సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి ప్రమాదవశాస్తు కిందపడి బెంగాల్‌ క్యాంపు నివాసి సమీర్‌మండల్‌ అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. రైల్వేపోలీసులు 108 అంబులెన్స్‌లో అతన్ని సిర్పూర్‌.టి ఆసుపత్రికి తరలించారు.