ప్రముఖ సంగీత దర్శకుడు రవీందర్ జైన్ కన్నుమూత
హైదరాబాద్ అక్టోబర్ 9 జనంసాక్షి):
ప్రముఖ సంగీత దర్శకుడు రవీంద్ర జైన్(71) శుక్రవారం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబయి లోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్‌లో చోర్ మచాయే షోర్, గీత్ గాతా చల్, చిత్‌చోర్, సౌదాగర్, జంగ్‌బాజ్, పూలన్‌దేవి, ప్రతిఘాత్, పతీ పత్నీ ఔర్ తదితర చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. తెలుగులో బ్రహ్మశ్రీ విశ్వామిత్ర, దాసి చిత్రాలకు సంగీతం సమకూర్చారు.ప్రముఖ గాయకుడు జేసుదాసును బాలీవుడ్‌కు పరిచయం చేసింది రవీంద్ర జైనే కావడం విశేషం.