ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్…ఈ తేదీల్లో టికెట్లు బుక్‌చేసుకుంటే 10 శాతం రాయితీ
ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్…ఈ తేదీల్లో టికెట్లు బుక్‌చేసుకుంటే 10 శాతం రాయితీ
దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు ముందస్తు టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు.అక్టోబర్ 15 నుంచి 29 మధ్య ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10 శాతం ఈ డిస్కౌంట్ కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో ప్రయాణానికి ఈ నెల 30లోగా ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకే ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు. రిజర్వేషన్‌కు www. tsrtconline.in ను చూడాలన్నారు.