ప్రయివేట్ బడులు వద్దు ప్రభుత్వ బడులే ముద్దు.
ప్రయివేటు బడులను బహిష్కరించి ప్రభుత్వ బడులలోనే చదవాలి.
– గ్రామ సర్పంచ్ చింతల పద్మ
దుబ్బాక 22, జూన్ ( జనం సాక్షి )
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో బుధవారం నాడు బడి బాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల,ప్రాథమిక పాఠశాలల విద్యార్థిని విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయుల బృందం మరియు గ్రామ సర్పంచ్ చింతల పద్మ ప్రభాకర్,గ్రామ ఎంపీటీసీ సంగెపు శోభ స్వామి ఎస్ యం సి ఛైర్మెన్ ఆధ్వర్యంలో గ్రామంలో పురవిధుల గుండా ప్రయివేట్ బడులు వద్దు ప్రభుత్వ బడులే ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ బడి ఇడు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని ఇతర గ్రామాలకు వెళ్లి చదువద్దని ప్రయివేటు బడులను బహిష్కరించి ప్రభుత్వ బడులలోనే చదువులని గ్రామ ప్రజలకు బడి పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.గ్రామంలో ఉన్న బడులలోనే చదివి ప్రభుత్వ బడులను అభివృద్ధి చెందేట్లు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ,నజీర్,ఉపాద్యాయ బృందం,గ్రామ ఉపసర్పంచ్ రంగు లక్ష్మీరాజు,వార్డ్ మెంబర్ పెంబర్తి బాలకిషన్,గుంటి రాజు,తెరాస నాయకులు,రామకృష్ణప్రభు,ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు,
తదితరులు పాల్గొన్నారు.