ప్రవేశాల గడువు పొడిగింపు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఓపెన్‌స్కూల్‌ పదో తరగతి, ఇంటర్‌ కోర్సుల్లో ప్రవేశానికి గడువును ఈనెల 10వరకు పొడిగించినట్లు ఓపెన్‌ స్కూల్‌ జిల్లా సమన్వయకర్త అశోక్‌ తెలిపారు. పదో తరగతికి ఓసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పురుషులతో పాటు మహిళలందరికీ రూ.600 పరీక్ష ఫీజు ఉంటుందని, అదే ఇంటర్‌ ప్రవేశానికి ఓసీ పురుషులకు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పురుషులతో పాటు మహిళలందరికీ రూ.800 పరీక్ష ఫీజు ఉంటుందని వివరించారు. రిజిస్టేష్రన్‌, విూసేవ ఛార్జీలు అదనంగా ఉంటాయని తెలిపారు. అభ్యర్థులకు సవిూపంలోని అధ్యయన కేంద్రాలనుగానీ, ఎంఈవోలను సంప్రదించాలని సూచించారు.