ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
ఖమ్మం పట్టణం: విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ విపక్షాలు చేపట్టిన బంద్ ఖమ్మం జిల్లాలో ప్రశాతంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 5గంటలనుంచి వామపక్షాల నేతలు ఖమ్మం బన్ డిపోలో ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి పోతు రంగారావు, వైకాపా జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆయా పార్టీల కార్యకర్తలు బంద్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఆటోలను సైతం తిరగకుండా అడ్డుకున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి.