ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

 జిల్లా కలెక్టర్  పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):సూర్యాపేటలో  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.ఆదివారం సూర్యాపేటలో జరిగిన గ్రూప్-1 ప్రిలీమినరి పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు.తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్, ప్రతిభ జూనియర్ కాలేజ్ లతో పాటు పలు పరీక్షా కేంద్రాలలో బయోమెట్రిక్ విధానం, పరీక్ష నిర్వహణ ప్రక్రియను పరిశీలించారు.హాజరు వివరాలను తెలుసుకున్నారు.పరీక్షా కేంద్రాలను పరిశీలించి అభ్యర్థులు పరీక్షను రాస్తున్న విధానాన్ని పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందన్నారు.జిల్లాలో ఏర్పాటు చేసిన 31 పరీక్షా కేంద్రాలలో మొత్తం 9181 , అభ్యర్థులకు గాను 7472, విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 1709 మంది ఆబ్సెంట్ అయ్యారని చెప్పారు. 81.39 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు.