ప్రశాంతంగా నిమజ్జనోత్సవాలు

పోలీస్‌ అధికారుల సూచన

జగిత్యాల,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా జరిగేలా మండప నిర్వాహకులు పూనుకోవాలని జిల్లా పోలీస్‌ అధికారులు సూచించారు. పోలీసులకు సహకరించి ముందుకు సాగాలన్నారు. వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని తెలిపారు. ఎక్కడిక్కడ పోలీస్‌ అధికారులు వినాయక మండపాల నిర్వాహకులు, మున్సిపల్‌, ట్రాన్స్‌కో అధికారులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్‌ కాకుండా, మేళతాళాలు, డప్పుచప్పుళ్ల నడుమ సంప్రదాయం ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించాలని తెలిపారు. పండుగలను మతాలకతీతంగా కలిసిమెలిసి జరుపుకోవాలని సూచించారు. గతంలో పలు మండపాల వద్ద యువజన సంఘాల సభ్యులు అతిగా ప్రవర్తించారనీ, ప్రస్తుతం వారిపై గట్టి నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. మతసామరస్యాలకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.