ప్రస్తుతానికి విద్యావాలంటీర్లే

1
– వచ్చే ఏడాదే డీఎస్సీ

– కడియం శ్రీహరి

హైదరాబాద్‌,అక్టోబర్‌1(జనంసాక్షి):

త్వరలోనే ఖాళీలకు అనుగుణంగా డిఎస్సీ నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వ్చే ఏడు డిఎస్సీకి అవకాశం ఉందన్నారు. అప్పటికి ఖాళీలపై స్‌ప్‌ష్టతో రాగలదన్నారు. ప్రస్తుతానికి విద్యావాలంటీర్ల నియామకాలు చేపట్టామన్నారు.  అన్ని జిల్లాల్లో పారదర్శకంగా విద్యావాలంటీర్ల నియామకాలు జరిగాయని వెల్లడించారు. విద్యార్థులకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే ఏడాది విద్యా వాలంటీర్ల నియామకం చేపట్టినట్లు చెప్పారు. 6,400  మంది విద్యా విద్యావాలంటీర్లు ఇప్పటికే విధుల్లో చేరారని, విధుల్లో చేరేందుకు అక్టోబరు 5 తుది గడువు అని తెలిపారు. గడవు పెంచాలని జిల్లా కలెక్టర్లు చేసిన సూచన మేరకు ఈ నిర్ణం తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో ఇంకా 1200కు పైగా విద్యావాలంటీర్ల నియామకాలు జరగాల్సి ఉందని తెలిపారు. సచివాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ… విద్యావాలంటీర్ల గౌరవ వేతనం రూ.8వేలకు పెంచామని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ విద్యావాలంటీర్లతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటికి మెరిట్‌ ఆధారంగానే విద్యావాలంటీర్ల నియామకం చేపట్టామని శ్రీహరి స్పష్టం చేశారు. విద్యావాలంటీర్ల నియామకం పూర్తి అయిందని పేర్కొన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా నియామకం చేపట్టామని ఉద్ఘాటించారు. విద్యార్థులకు నష్టం జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ ఏడాది విద్యావాలంటీర్లను నియమించడం జరిగిందని తెలిపారు. ఇక ఇప్పటికే 6,480 మంది విద్యావాలంటీర్లు విధుల్లో చేరారు. ఇంకా విధుల్లో చేరని వారు అక్టోబర్‌ 5వ తేదీ వరకు రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు. ప్రస్తుతం 7,491 పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు పరిశీలించాక టీచర్ల ఏకీకృత సర్వీసు రూల్స్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. విద్యావాలంటీర్ల నియామకాలు పారదర్శకంగా జరిగాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని కడియం శ్రీహరి పేర్కొన్నారు.  ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలకు అర్థంలేదని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు.రుణమాఫీ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌పై కేసీఆర్‌ చర్చిస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం తగదని ఆయన అన్నారు.