ప్రాంతీయ పార్టీలు ఏకమైతే అధిక సీట్లుసాధ్యం

 


– జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలే కీలక భూమిక పోషిస్తాయి

– సీఎం కేసీఆర్‌ స్పష్టీకరణ

– డీఎంకే నేత కనిమొళితో భేటీ అయిన కేసీఆర్‌

– గంటపాటు ఫెడరల్‌ ఫ్రంట్‌, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ

– కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులను సందర్శిస్తా

– డీఎంకే నేత కనిమొళి

చెన్నై, జ‌నం సాక్షి ) : ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి వస్తే కాంగ్రెస్‌, బీజేపీ కంటే అధిక సీట్లు సాధించవచ్చునని, ఆమేరకే అన్ని ప్రాంతీయ పార్టీలు ఐక్యంగా ముందుకు సాగేలా కృషి జరుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. సోమవారం చెన్నైలోని ఐటీసీ చోళ ¬టల్‌లో కేసీఆర్‌ డీఎంకే ఎంపీ కనిమొళితో సమావేశమయ్యారు. దేశ రాజకీయాలు, ఫెడరల్‌ ఫ్రంట్‌ తదితర అంశాలపై గంట పాటు వీరిద్దరూ చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. అనేక రాష్టాల్ర సమ్మిళితమైన భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే సమైక్య స్ఫూర్తి పరిడవిల్లుతుందని కేసీఆర్‌ అన్నారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల కన్నా ప్రాంతీయ పార్టీలే ఎక్కువ సీట్లు సాధిస్తాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథ ప్రాజెక్టు, భూ రికార్డుల ప్రక్షాళనతో పాటు రైతులకు పంట పెట్టుబడి సాయం పథకాలపై సీఎం కేసీఆర్‌ సమావేశంలో కనిమొళికి వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ చేస్తున్న గొప్ప ప్రయత్నాలను ఎంపీ కనిమొళి అభినందించారు. దేశాభివృద్ధిలో రాష్టాల్రు, ప్రాంతీయ పార్టీలు మరింత ఐకమత్యంగా పనిచేయాలని కనిమొళి కోరారు. త్వరలో హైదరాబాద్‌కు వస్తానని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులను సందర్శిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌, ఎంపీలు కేశవరావు, వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మిషన్‌ భగీరథ పథకం చైర్మన్‌ ప్రశాంత్‌ కుమార్‌,

——————————–