ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధం
ఖమ్మం, జూలై 7 : జిల్లాలో ప్రాజెక్టుల పనుల పురోగతిపై బహిరంగ చర్చకు సిద్ధమని, కాంగ్రెస్ నాయకులు కూడా అందుకు సిద్ధం కావాలని టిడిపి నేతలు నాగచంద్రారెడ్డి అన్నారు. ప్రాజెక్టుల బాటపట్టిన టిడిపి నేతలను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదని నాగచంద్రారెడ్డి విమర్శించారు. జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ధ్వజమెత్తారు. ఇందిరా, రాజీవ్‌సాగర్‌లలో వేలాది కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. జిల్లాకు నష్టం చేసే నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్‌కు 8 కోట్ల మేరకు ప్రభుత్వం వ్యయం చేసిందని ధ్వజమెత్తారు. వాటన్నీంటినీ గుత్తేెదారుల నుండి రాబట్టాలని డిమాండ్ చేశారు. 2500 కోట్ల రూపాయలను ఖర్చు చేసినా ఒక ఎకరాకు ప్రభుత్వం నీరు ఇవ్వలేకపోయిందన్నారు. గోదావరిపై, జిల్లాలో అనేక ఎత్తిపోతల పథకాలతో పాటు ప్రాజెక్టులను పూర్తి ఘనత మాజీ మంత్రి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీకి చెల్లుతుందని ఆయన తెలిపారు.