ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం చర్యలు: ఎమ్మెల్యే 

జనగామ,మే1(జ‌నంసాక్షి): రిజర్వాయర్లను పూర్తి చేయాలన్న లక్ష్యంతో  ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో రిజర్వాయర్లలో తట్టెడు మట్టి పోయలేదని మండిపడ్డారు. పాలకుర్తి రిజర్వాయర్‌ పనుల్లో వేగం పెంచాలని, పనులు నత్తనడక సాగుతున్నాయని అన్నారు. పాలకుర్తి రిజర్వాయర్‌తో ఏడు గ్రామాల రైతులకు సాగునీరు అందుతుందన్నారు. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లు పూర్తయితే పాలకుర్తి మండలం సస్యశ్యామలమవుతుందన్నారు. పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతులు సహకరించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. రిజర్వాయర్‌ పనుల్లో జరుగుతున్న జాప్యంపై కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచకపోతే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఈఈని ఎమ్మెల్యే ఆదేశించారు. రెండు నెలల్లో సగం పనులు పూర్తి చేయాలని ఆయన అన్నారు. రిజర్వాయర్‌ పనులను మరోసారి సం దర్శిస్తానన్నారు.