ప్రాణహిత రద్దుతోనే జాతీయ హోదా దక్కలేదు
ప్రజలను మభ్యపెట్టడం అలవాటయ్యింది: శ్రీధర్ బాబు
కరీంనగర్,జూలై24(జనంసాక్షి): ప్రాజెక్టుల నిర్మాణంపై నాటి కాంగ్రెస్ పాలనను విమర్శించే ముందు ఇంతకాలంగా శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, ఎల్‌ఎండి, నిజాంసాగర్, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదా అన్నది గుర్తుంచుకోవాలని మాజీమంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. ప్రాణహిత రద్దువల్ల నేడు జాతీయ ప్రాజెక్టు ¬దా రాకుండా పోయిందని, ఇది కేసీఆర్ అసమర్థతకు ఆనాలోచిత నిర్ణయానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హాయంలోనే పూర్తయిన ఎల్లంపల్లిని పూర్తి స్థాయిలో రెండు టీఎంసీల నీటిని మంథనికి పంపింగ్ చేయడం జరిగిందన్నారు. అప్రాజెక్టును కొంతస్పిల్ ఓవర్ వర్క్స్ పూర్తిచేసి ఉంటే ఎగువన ఉన్న చొప్పదండి, వేములవాడ, నియోజకవర్గాలను నీరు సంవృద్దిగా లభించేవన్నారు. రెండేళ్లుగా కనీసం ఈ చిన్న ప్రయత్నాన్ని కూడా చేయలేదన్నారు. ఎ ఒక్క ప్రాజెక్టుకైనా డీపీఆర్ ఉందో బహిర్గతం చేయాలని ఆయన సవాల్ విసిరారు. టీఆర్‌ఎస్ లక్షరూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి నేడు చేస్తున్నదేంటో ప్రజలకు తెలియదా అని మాజీమంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉపాధి హామి నిధులను, కరువు సహాయక నిధులను కూడా దిగమింగుతూ అటు కూలీలను, ఇటు రైతులను నట్టేట ముంచుతున్నాడని, ఇది దివాళా కోరుతనానికి నిదర్శనం కాదా అన్నారు. జిల్లాలో ఎంతమంది వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మానానికి సంబందించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయో చూడాలని డిమాండ్ చేశారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలన్నింటిని మాఫీ చేయడమేకాక, సక్రమంగా చెల్లించిన రైతులకు 5 వేల బోనస్ ఇచ్చింది నిజం కాదా అన్నారు. మద్యాహ్న భోజన పథకం కార్మికులకు మూడు నెలలుగా బిల్లులు చెల్లించకపోగా అప్పులుచేసి చేసిన వాటిని కూడా ఇవ్వడంలేదని ఇంతకంటే పెద్ద ఉదాహారణ ఇంకేంకావాలన్నారు.