ప్రాణాలు బలిగొన్న ప్రమాదాలు

ఆదిలాబాద్‌ (జనంసాక్షి): ప్రమాదాలు పలువురి ప్రాణాలు బలిగొన్నయి. వ్యాపార పనిమీద పొరుగు జిల్లాకు వెళ్లిన ఇద్దరు యువ వ్యాపారులు (సోదరులు) అక్కడే రోడ్డు ప్రమదంలో దుర్మరణం చెందగా,మరొకరు సైతం పొరుగు జిల్లాఓనే బంధువుల పెద్దకర్మకు వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ఇంకోచోట సరదాగా బైక్‌ నడుపుతున్న విద్యార్థి ఆదుపుతప్పి డివైడర్‌కు ఢీకొనగా, వేరేచోట ఉపాధి వేటలో వృద్ధుడిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. ఇవేకాక వేర్వేరు రైలు ప్రమిదాల్లోనూ ఇద్దరు కానరాని లోకాలకు వెళ్లారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రం సమీపంలోని వల్లంపహాడ్‌ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు యువ వ్యాపారవేత్తలను బలితీసుకుంది. లక్సెట్టిపెట మండలం ఇటిక్యాలకు చెందిన అన్నదమ్ములు బుద్దె మురళీమోహన్‌(32), బుద్దె మల్లేశ్‌(29) వ్యాసారం నిమిత్తం బట్టలు కొనుగోలు చేసేందుకు ద్విచక్రవాహనంపై కరీంనగర్‌ వస్తున్నారు. కరీంనగర్‌ మండలం వల్లంపహాడ్‌ వద్ద ఎదురుగా మిర్చీ లోడ్‌తో వేగంగా వస్తున్న లారీ వీరిని ఢీకొట్టింది. మురళీమోహన్‌ అక్కడిక్కడే మృతి చెందగా, మల్లేశ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆయన కూడా చనిపోయాడు. మురళికి భార్య, కుమారుడు, మల్లేశ్‌కు భార్య. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మురళి, మల్లేశ్‌ మరణంతో ఇటిక్యల విషాదం అలుముకుంది. వీరిద్దరు లక్సెట్టిపెటలో కల్యాణలక్ష్మి షాపింగ్‌ మాల్‌ నిర్వహిస్తున్నారు. పని నిమిత్తం ద్విచక్రవాహనంపై కరీంనగర్‌ వెళ్లగా లారీ రూపంలో మృత్యువు తీసుకెళ్లడంలో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మురళి, మల్లేశ్‌ మృతికి సంతాప సూచికంగా అక్సెట్టిపేట పట్టణంలో శుక్రవారం వ్యాపారసంస్థల బంద్‌కు ఐక్యవ్యాపార సంఘం పిలుపునిచ్చింది.