ప్రాథమిక పాఠశాల సమగ్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ బ్యూరో-జూన్ 7(జనంసాక్షి)

చోక్ల తండా లో మన ఊరు మన బడిలో భాగంగా ప్రాథమిక పాఠశాల సమగ్ర అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ కె. శశాంక తో కలిసి శంకుస్థాపన చేశారు. మంగళవారం బయ్యారం మండలంలో మంత్రులు పర్యటించి చోక్ల తండా గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా 2.98 కోట్ల రూపాయల అంచనా విలువతో చేపట్టనున్న ప్రాథమిక పాఠశాల సమగ్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత,  జెడ్పీ చైర్ పర్సన్ అంగొతు బిందు, ఎమ్మెల్సీ తక్కెల్లపల్లి రవీందర్, ఎమ్మేల్యే హరిప్రియ, శంకర్ నాయక్, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ కె. శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో కొమురయ్య, జిల్లా, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.