ప్రారంభమైన ఎమ్మెల్యేల వివ్‌ ఉల్లంఘనపై సభాపతి విచారణ

హైదరాబాద్‌ : అవిశ్వాస తీర్మానం సందర్భంగా వివ్‌ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ విచారణ ప్రారంభించారు. ఈ విచారణకు ప్రభుత్య చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరణారెడ్డి న్యాయవాదితో కలిసి హాజరయ్యారు. అయితే వివ్‌ ధిక్కరించిన ఎమ్మెల్యేలు విచారణకు దూరంగా ఉన్నారు. ఫ్యాక్స్‌ ద్వారా తమ వివరణను ఇద్దరు ఎమ్మెల్యేలు శాసనసభాపతి కార్యాలయానికి పంపించారు. తక్షణమే తమపై అనర్హత వేటు వేయాలని లేఖలో కోరారు.