ప్రీతికి కన్నీటి వీడ్కోలు స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు
కొడకండ్ల, ఫిబ్రవరి 27(జనం సాక్షి ) : హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందిన పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి (26) అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం జనగామ జిల్లాలోని కొడకండ్ల మండలం లోని స్వగ్రామమైన గిర్నితండాకు ఆమె మృతదేహాన్ని తీసుకరాగ, ఇంటి వద్ద ప్రీతి మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం మధ్యాహ్నం మృతదేహాన్ని ట్రాక్టర్‌పై ప్రీతి ఇంటికి సమీపంలోని వారి వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి పూడ్చిపెట్టారు.అంత్యక్రియలకు వివిధ పార్టీల నేతలు హాజరకాగా, ప్రీతి పార్ధివ పెటికను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మోశారు. భాజపాకు చెందిన మాజీ ఎంపీ రవీందర్‌నాయక్, కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి, స్థానిక భారాస నేతలు, మాజీ జీసీసీ ఛైర్మన్ గాంధీనాయక్,మండల బిఆరెస్ నాయకులు,ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు, సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.