ప్రేమికుడు నిర్లక్ష్యం: కారులోనే కాలి బూడిదైన ప్రేయసి
న్యూయార్క్: ప్రేమించిన అమ్మాయి కష్టాల్లో ఉంటే ఏ ప్రేమికుడైనా జాలి చూపిస్తాడు. అదే ప్రేమించిన అమ్మాయి ప్రాణాపాయస్థితిలో ఉంటే ప్రాణాన్నైనా పణంగా పెడతాడు. కానీ ఓ ప్రేమికుడు దయలేకుండా ప్రవర్తించాడు. కనీసం రక్షించే ప్రయత్నం చేయలేదు. కళ్ల ముందే ప్రేయసి ప్రమాదంలో ఉంటే పట్టించుకోకుండా దూరంగా పరిగెత్తాడు. దారుణమైన ఈ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగింది. పూర్తి వివరాలలోకి వెళ్తే.. ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు ఏమాత్రం జాలీ, దయ లేకుండా ప్రవర్తించాడు. తాను నడుపుతున్న కారుకి మంటలు అంటుకోవడంతో కారులోని ప్రేయసిని రక్షించకుండానే దూరంగా పరిగెత్తాడు. రహదారిపై జరిగిన ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. భారత సంతతికి చెందిన 25 ఏళ్ల హర్లీన్ గ్రేవాల్ అనే యువతి కారులోనే సజీవదహనమైందని అధికారులు గుర్తించారు. ఈ ట్యాక్సీని నడుపుతున్న సయీద్ అహ్మద్ అనే 23 ఏళ్ల యువకుడు కారులోని యువతిని రక్షించకుండా దూరంగా పరిగెత్తాడు. ప్రేయసి కాలిపోతుండగానే హాస్పిటల్‌కు వెళ్లాలంటూ వేరే కారు డ్రైవర్లను సహాయం కోరి హాస్పిటల్‌కు వెళ్లాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు లైసెన్స్ రద్దు చేస్తున్నామని తెలిపారు. హర్లీన్ గ్రేవాల్‌తో తాను డేటింగ్ చేస్తున్నానని నిందితుడు అహ్మద్ పోలీసులకు వెల్లడించాడు. కనికరంగా లేకుండా ప్రవర్తించిన అహ్మద్‌ను దయలేని వ్యక్తిగా పోలీసులు వర్ణించారు. మృతురాలి కుటుంబం భారత్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందినదిగా పోలీసులు తెలిపారు.