ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో యువకుడు ఆత్మహత్య
రామకృష్ణాపూర్ (ఆదిలాబాద్): ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ యువకుడు ఆత్యహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం కూర్మపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అందుగుల మల్లేశ్ (25) ఈ ఉదయం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించిన అమ్మాయిని కాదని కుటుంబసభ్యుల వేరే పెళ్లి సంబంధాలు చూడటంపై ఆవేదనకు గురై మల్లేశ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.



