ప్రేమ పేరుతో యువతికి వేధింపులు
యాసిడ్ తో యువతిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడిన యువకుడు
- చికిత్స పొందుతున్న బాధితురాలు
-
నా సోదరి అనుకుంటా,బాధితురాలి తండ్రితో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెకు చెందిన యాసిడ్ బాధితురాలు తండ్రి జనార్ధన్ కు మంత్రి నారా లోకేశ్ ఫోన్ చేశారు. బాధితురాలి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఆయనకు పూర్తి భరోసా ఇచ్చారు.
“చెల్లి కోలుకోవడానికి అత్యంత మెరుగైన వైద్యం అందిస్తాం. ఆమెను నా సొంత చెల్లిగా భావించి అండగా నిలుస్తా. యాసిడ్ దాడి ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. దాడిచేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తాం, అలాంటి సైకోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. అధైర్య పడొద్దు, మీ వెంట నేనున్నాను” అంటూ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
అక్కడే ఉన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తో కూడా మాట్లాడిన లోకేశ్… బాధితురాలు కోలుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆమె వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా సూచించారు.