ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా

నిజామాబాద్‌: దోమకొండ మండలం అంబారిపేట వద్ద ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈఘటనలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. పలువురిని బస్సు నుంచి స్థానికులు రక్షించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రి తరలించారు.