ప్రైవేటు సెక్యూరిటి గార్డుల వాచ్ మెన్ ,స్వీపర్, ఆఫీస్ బాయ్ ల సమస్యలు పరిష్కరించాలని లేబర్ ఆఫీసు ముందు ధర్న
కరీంనగర్ టౌన్ అక్టోబర్ 31(జనం సాక్షి):-
సెక్యూరిటీ గార్డుల సమస్య పరిష్కరించాలని ఆల్ ఇండియా డిమాండ్స్ డే ను పురస్కరించుకొని, స్థానిక మంకమ్మ తోట లేబర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ M.కోటేశ్వర్ కు పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ,,,,,,,
పెరుగుతున్న పరిశ్రమలు,వ్యాపార అభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునీకరణ పట్టణ అభివృద్ధి తదితర అంశాలు మూలంగా ప్రవేటు సెక్యూరిటీ సర్వీసెస్ పరిశ్రమ పెద్ద ఎత్తున విస్తరిస్తున్న దన్నారు. దేశంలో సుమారు 90 లక్షల మంది సెక్యూరిటీ గార్డులు మరియు అలైడ్ వర్కర్లు వివిధ రకాల సంస్థలో పని చేస్తా ఉన్నారు. స్వదేశీ ,విదేశీ, కార్పోరేట్ ప్రైవేటు సెక్యూరిటి ఏజెన్సీలు ఈ పరిశ్రమపై అజమాయిషీ కలిగి ఉండి, సెక్యూరిటీ గార్డ్లు వర్కర్ల శ్రమను కొల్లగొడుతున్నాయి.రోజుకు 12 గంటలు పని చేస్తున్న కనీస వేతనాలు ఎక్కడ అమలు కావడం లేదన్నారు. పీఎఫ్ ,ఈఎస్ఐ ,బోనస్, గ్రాట్యూటీ లాంటి సామాజిక భద్రత సదుపాయాలు కల్పించడం లేదు.ఉపాధిని వెతుక్కుంటూ గ్రామాల నుండి అర్బన్ ప్రాంతాలకు వచ్చి ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు పనిచేస్తున్నారు.ఈ కార్మికులకు బానిసలుగా పని చేయించుకుంటూ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ లాభాలు పొందుతున్నాయి. ఈ సంస్థలు నియంత్రించి ,కార్మికులకు తగిన రక్షణ కల్పించేందుకు ,కేంద్ర ప్రభుత్వం 2005 లో తెచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ (రెగ్యులేషన్ ) యాక్ట్ ను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమం గా అమలు చేయడం లేదు.* ఫలితంగా సెక్యూరిటీ యాజమాన్యాలు చట్టవిరుద్దంగా వ్యవహరిస్తున్నారు, ఈ సర్వీస్ లో పనిచేస్తున్న గార్డు లకు కనీస వేతనాలు – ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం.
దేశంలో సుమారు 22 వేల ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు సర్వీసులు ఆపరేట్ అవుతున్నాయి. ఇండియన్ నార్త్ ఈస్ట్ లాంటి పేర్ల తో కంపెనీలు నడుస్తున్నాయి.పిఎస్ఆర్, యాక్ట్ 2005 సెక్షన్ 4 ప్రకారం ప్రభుత్వం నుండి లైసెన్సులు పొందిన సంస్థలే ఈ సర్వీసులు కొనవచ్చు కొనసాగించాలి కానీ చాలా కంపెనీ ఎలాంటి లైసెన్స్ లేకుండానే చట్టం విరుద్ధంగా తన కార్యక్రమాలు సాగిస్తున్నాయి.అనేక ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ పరిశ్రమలు సంస్థలు సెక్యూరిటీ విభాగాలను అవుట్సోర్సింగ్ చేశారు.ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకింగ్ మరియు ఏటీఎంల నిర్వహణ క్యాష్ నింపడం ఏజెన్సీ గార్డులు పనిచేస్తున్నారు.ముఖ్యంగా కమర్షియల్ కాంప్లెక్స్లు కార్పొరేట్ హాస్పిటల్స్, స్కూల్ ,కాలేజీలు షాపింగ్ మాల్స్ , షోరూమ్స్ గోదామ్స్, రెసిడెన్సి కమ్యూనిటీస్ , హోటల్స్, రెస్టారెంట్స్ ,మరియు పబ్లిక్ స్థలాలు- పార్కులు అపార్ట్మెంట్లు, చిట్ ఫండ్స్ ,బ్యాంకులు వద్ద తదితర చోట్ల ఈ పనులన్నీ ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు హౌస్ కీపింగ్ సిబ్బందినే పని చేస్తున్నారు.
విస్తారమైన సెక్యూరిటీ పరిశ్రమలలో పనిచేస్తున్న గార్డులు మరియు ఆలైడ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదు.ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో సెక్యూరిటీ ఏజెన్సీల దోపిడీ యదేచ్ఛగా కొనసాగుతున్నది.
కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, కనీస వేతనాలను పెరిగిన ధరను అనుగుణంగా సవరించకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఫలితంగా కార్మికుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. ప్రైవేటు సెక్యూరిటీ సర్వీస్ లో పనిచేస్తున్న గార్డుల కు 7,000 నుండి 10,000 మాత్రమే చెల్లిస్తున్నారు.*
ఎలాంటి బ్రేక్ లేకుండా 12 గంటలు పని, కేంద్ర చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు రూల్స్ రూపొందించి కనీస వేతనం నిర్ణయించి అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.*
రాష్ట్ర ప్రభుత్వం జీ,వో 21ని గెజిట్ చేసి అమలు చేయాలి, 8 గంటలు పని ,కనీస వేతనాలు అమలు చేయాలన్నారు .ఉద్యోగ భద్రత కల్పించాలి, ఈఎస్ఐ, ఈపీఎఫ్ ,తదితర కార్మిక చట్టాలు అమలు చేయాలన్నారు.బోనస్ చెల్లించాలి సెక్యూరిటీ సర్వీసులో పని చేసే వారందరికీ అపాయింట్మెంట్ లెటర్స్, గుర్తింపు కార్డు ఇవ్వాలి ,సెక్యూరిటీ గార్డ్స్ వాచ్ మెన్ లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు.నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలనీ కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పున్నం రవి, వట్టి జగదీష్,కనుకుంట్ల రవీందర్, కొత్తూరి మల్లేశం,షేక్ హైమద్, MD. ఫారుక్ మహబూబ్, MD. అయుబ్ ఖాన్, చల్ల హరికృష్ణ ,,మామిడి మహేష్ , దేవన్న ,MD. రఫీ యుద్దీన్, టి నారాయణ రెడ్డి ,ఆర్కేటీ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.