ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఊరట
హైదరాబాద్,జులై15(జనంసాక్షి):
ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. సింగిల్ బెంచ్ ఆర్డర్ కాపీలో ఒక అంశాన్ని డివిజన్ బెంచ్ సవరించింది. 10 రోజుల్లోగా మరోసారి తనిఖీలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. తనిఖీల్లో అవకతవకలు జరిగితే అనుమతులు రద్దు చేయాలని కోర్టు సూచించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల అనుబంధ గుర్తింపు, కౌన్సెలింగ్‌పై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కౌన్సెలింగ్‌కు అనుమతిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని, 113 కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి వెంటనే నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించిది. తనిఖీల కోసం 25 బృందాలు ఏర్పాటు చేయాలని జేఎన్‌టీయూను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో తెలంగాణలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఊరట లభించినా నిబందనలు వర్తిస్తాయి. అలాగే సింగిల్‌బెంచ్ తీర్పులో ఒక అంశాన్ని సవరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని, 25 బృందాలతో నెలాఖరులోగా తనిఖీలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతి కాలేజీ రూ.2 లక్షలు డిపాజిట్ చేయాలని తెలిపింది. అలాగే లోపాలున్న కాలేజీలను కౌన్సెలింగ్ నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.